రజినీకాంత్ (Rajinikanth) , మంజు వారియర్ (Manju Warrier) జంటగా నటించిన మూవీ ‘వేట్టయన్’ (Vettaiyan) . ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలై పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ‘జైలర్’ (Jailer) రేంజ్లో కలెక్ట్ చేయలేకపోయింది. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చినా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించడానికి చాలా కష్టపడుతుంది.
ఒకసారి (Vettaiyan) 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.07 cr |
సీడెడ్ | 1.63 cr |
ఉత్తరాంధ్ర | 1.15 cr |
ఈస్ట్ | 0.53 cr |
వెస్ట్ | 0.41 cr |
గుంటూరు | 0.56 cr |
కృష్ణా | 0.74 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.45 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.9.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకున్నప్పటికీ ఈ మూవీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద డౌన్ అయిపోయింది. పోటీగా సినిమాలు లేకపోయినా ‘వేట్టయన్’ బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడుతుంది.