Director Krish: ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్సే లేదట!

దర్శకుడు క్రిష్.. వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థకు ఈ సినిమాను అమ్మేశారని వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదట. షూటింగ్ పార్ట్ మాత్రమే అయింది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ చాలా కీలకమని తెలుస్తోది.

అటవీ నేపథ్యంలో సాగే కథ కావడంతో.. అడవిలో జంతువులను, ఆ వాతావరణాన్ని సృష్టించడానికి వీఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఎనభై సత్తా పని వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్లదే. విదేశీ కంపెనీలకు ఆ పనులను అప్పగించాడు క్రిష్. డిసెంబర్ వరకు ఫస్ట్ కాపీను ఇవ్వలేమని సదరు వీఎఫ్ఎక్స్ కంపెనీలు తేల్చి చెప్పేశాయట. కాబట్టి ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ ఉండకపోవచ్చు. వీఎఫ్ఎక్స్ తో పని కాబట్టి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ఈ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

జంగిల్ బుక్ లాంటి విజువల్స్ ఉన్నప్పుడు వాటిని ఓటీటీలో అంతగా ఆస్వాదించలేమని.. కాబట్టి థియేటర్లోనే సినిమా రిలీజ్ చేయాలని క్రిష్ అండ్ కో నిర్ణయించుకుందట. సో.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ‘ఉప్పెన’ లాంటి హిట్ సినిమా తరువాత వైష్ణవ్ నుండి వస్తోన్న సినిమా కాబట్టి బిజినెస్ బాగా జరుగుతుందని నమ్ముతున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus