‘ఊరి పేరు భైరవకోన’… ఈ టైటిల్ వింటుంటే మీకు ఎక్కడైనా కామెడీ సినిమా అనే ఆలోచన కలుగుతోందా? కనీసం ఆ సినిమా పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడైనా మీకు అలా అనిపించిందా? ఎవరికీ అలా అనిపించే అవకాశమే లేదు. అయితే దర్శకుడు వీఐ ఆనంద్ మాత్రం ఈ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్విస్తాం అని అంటున్నారు. అదెలా సాధ్యం అంటే.. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలే ఉదాహరణ. ఇప్పటికే కొన్నిసార్లు ఇలా నవ్వించిన ఆయన మళ్లీ అదే చేస్తున్నారట.
గరుడ పురాణంలోని కొన్ని ప్రకరణల స్ఫూర్తితో ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా కథ రాసుకున్నారట. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో వివరంగా ఉందని, ఆ విషయాలు ఈ సినిమాలో చర్చిస్తాం అని అంటున్నారు. అలాగే కర్మ సిద్ధాంతం సహా చాలా విషయాలు ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నారు. అలాగని సీరియస్‌గా సాగే సినిమా కాదని, సరదాగా సాగుతుందని చెప్పారాయన. ‘ఊరు పేరు భైరవకోన’ అని పేరెందుకు పెట్టారో సినిమాలో తెలుస్తుందన్నారు.
‘టైగర్’ సినిమా తర్వాత తను, సందీప్ కిషన్ ఓ సినిమా చేయాలనుకున్నామని, ‘డిస్కోరాజా’ సినిమా తర్వాత ఈ కథ రాసుకున్నానని చెప్పారు. ఈ సినిమా మొదలుపెట్టే సమాయానికి ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు రాలేదని, ఇదొక ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుందని అనుకుని మొదలుపెట్టామని చెప్పారు ఆనంద్. ఇక ఎప్పుడూ థ్రిల్లర్‌లు చేస్తుంటారు ఏంటి కారణం అని అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పారు.
కథని ఆసక్తికరంగా చెప్పడానికి, స్క్రీన్‌ప్లేని మలచడానికి అవకాశం ఉన్న జానర్ థ్రిల్లర్. తనకు బాగా ఇష్టపడే, మేకింగ్ పరంగా పట్టున్న జానర్ కావడంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నా అని తేల్చేశారు వీఐ ఆనంద్. అయితే ఎప్పుడు ఇలాంటివేనా అని అనిపించడంతో కొంతకాలంగా కొత్త తరహా కథలు రాసుకుంటున్నాను అని చెప్పారు. త్వరలో ఓ అగ్ర హీరోతో యాక్షన్ సినిమా చేయబోతున్నా అని పేర్కొన్నారు (Vi Anand) వీఐ ఆనంద్.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!