విఐ ఆనంద్, చక్రి చిగురుపాటి కలయికలో సినిమా
- November 21, 2016 / 06:34 AM ISTByFilmy Focus
తమిళ సినిమా ‘అప్పూచి గ్రామం’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన విఐ ఆనంద్ సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘టైగర్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో దర్శకుడిగా పాస్ మార్కులు వేయించుకున్న ఈ తమిళ దర్శకుడు తెలుగు చిత్రసీమలో పాగా వేశాడు. నిఖిల్ హీరోగా ఆనంద్ తెరకెక్కించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇటీవల సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇదే ఊపులో తర్వాతి సినిమాకి సిద్ధమైపోయాడు ఆనంద్.
‘స్వామి రారా’, ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాలను నిర్మించిన చక్రి చిగురుపాటి ఈ మధ్య స్పీడ్ పెంచి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. మొన్నటికి మొన్న సందీప్ కిషన్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా తమిళ దర్శకుడు సుశీంద్రన్ రూపొందించనున్న సినిమాని ఆరంభించిన ఈ నిర్మాత తర్వాతి సినిమా కోసం విఐ ఆనంద్ తో చేతులు కలపనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పోతే.. రాజ్ తరుణ్ – విఐ ఆనంద్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. అది ఇదేనా కాదా అన్నది కూడా రానున్న ఈ ప్రకటనతో తేలిపోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











