Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

‘హనుమాన్’ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మిరాయ్’. స్టార్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 3వ సినిమా ఇది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని మెప్పించింది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్స్ లో విజువల్స్ గ్రాండ్ గా అనిపించాయి. కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ కి ఇచ్చింది.

Mirai

దీనిని కూడా ఈరోజు(సెప్టెంబర్ 12న) పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. అన్ని భాషల నుండి ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ‘మిరాయ్’ ని తెగ లేపుతున్నారు నెటిజన్లు.

అయితే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ‘మిరాయ్’ విషయంలో హర్ట్ అయ్యారు. వాళ్ళు మరెవరో కాదు తేజ సజ్జని ఫాలో అయ్యే వాళ్ళే. ఎందుకంటే ‘మిరాయ్’ కి మంచి హైప్ తీసుకొచ్చిన వాటిల్లో ‘వైబ్ ఉంది’ అనే సాంగ్ కూడా ఒకటి. టీజర్, ట్రైలర్ వంటివి ఏ రేంజ్లో మెప్పించినా.. ఈ సినిమా ఒకటి వస్తుంది అని ప్రతిసారీ గుర్తు చేసింది ‘వైబ్ ఉంది’ పాటే అని చెప్పాలి.

వినాయక చవితి టైంలో ప్రతి సందులో పెట్టిన మైకుల్లో ఈ పాటని ఎక్కువగా ప్లే చేశారు. అయితే ఈ పాట సినిమాలో లేకపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఈ పాట మాత్రమే కాదు నిధి అగర్వాల్ పై కూడా ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ఆ పాటను కూడా డిలీట్ చేశారట. సినిమా ఫ్లోకి ఆ పాటలు అడ్డుపడి.. ఆడియన్స్ మూడ్ ని డైవర్ట్ చేస్తాయని భయపడి స్వయంగా మేకర్స్ ఆ పాటలను డిలీట్ చేశారని తెలుస్తుంది.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus