KGF, RRR: సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హీరో?

కరోనాకి ముందు ఇండియన్ సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలని మాత్రమే చెప్పుకునేవారు అయితే కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు చెప్పుకునే స్థాయికి దక్షిణాది చిత్ర పరిశ్రమ చేరుకుంది.ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. ఇలా సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టగా బాలీవుడ్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంశలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నటుడు విక్కీ కౌశల్ సైతం దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. తాజాగా విక్కీ కౌశల్ నటించిన చిత్రం గోవిందా నామ్‌ మేరా అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆసినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి గల కారణాన్ని కూడా విక్కీ కౌశల్ తెలియజేశారు.

ఈ సినిమా కోవిడ్ కు ముందు డైరెక్టర్ తనకు కథ చెప్పారని అయితే కోవిడ్ సమయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రేక్షకులను నవ్వించడానికి ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని ఈయన తెలిపారు.

అందుకే కంటెంట్ ఉన్నటువంటి ఆర్ఆర్ఆర్, కే జి ఎఫ్ అంటే సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో మంచి విజయాలను అందుకున్నాయి అంటూ ఈ సందర్భంగా దక్షిణాది చిత్రాలపై నటుడు విక్కీ కౌశల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus