కెమెరా ఆన్‌లో ఉందా? సినిమా నటులకు ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇంకా చెప్పాలంటే పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఏది ఆఫ్ కెమెరా, ఏది ఆన్ కెమెరా అనేది చెప్పడం అంత ఈజీ కాదు. కెమెరా ఆన్‌లో లేదు అనుకుని ఏది పడి అది చేస్తే ఆ తర్వాత ఇబ్బందిపడతారు. గతంలో కొంతమంది ప్రముఖులు ఇలా కెమెరా ఆన్‌లో లేదనుకుని ఏది పడితే అది మాట్లాడేసి లేని పోని ఇబ్బందులు పడ్డారు, పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితే ఓస్టార్ హీరోకి ఎదురైంది. ఆ తర్వాత విషయం తెలిసి సిగ్గుతో బాగా ఇబ్బందిపడ్డాడట.
బాలీవుడ్‌లో ఓ మోస్తరు హీరోగా కెరీర్‌ను నడిపించుకుంటూ వచ్చి.. ‘ఉరి’ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు విక్కీ కౌశల్. ఆ సినిమా తర్వాత చేసిన ప్రతి కథా లార్జర్ దేన్ లైఫ్ అనేలానే ఉన్నాయి. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ చిన్న కెమెరా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పాడు విక్కీ కౌశల్. ఆ సినిమా భద్రతా దళ అధికారిగా విక్కీ కనిపిస్తాడు. అందులో యాక్షన్ సీన్స్ సెర్బియాలో షూట్ చేశారట. ఆ సమయంలో పాయింట్ ఆఫ్ వ్యూ ఫుటేజ్ కోసం విక్కీ భుజానకి ఓ గ్రో ప్రో కెమెరా పెట్టారట డైరక్టర్ అదిత్య ధర్.
షూటింగ్ జరుగుతున్నంతసేపు ఆ కెమెరాను ఆన్‌లోనే ఉంచుదామని, దాని వల్ల ఫుటేజ్ బాగా వస్తుంది దానిని తర్వాత ఎడిట్‌లో వాడొచ్చు అని చెప్పారట డైరక్టర్. విక్కీ కూడా ఓకే చెప్పి అలానే ఆన్‌లో ఉంచమన్నారట. అయితే దానిని ఆన్, ఆఫ్ చేసే పని డైరక్షన్ టీమ్‌లో ఒకరికి చెప్పారట. అయితే ఆయన ఒక్కోసారి ఆప్‌చేసే వాడు కాదట. అలా ఓసారి ఆన్‌లోనే ఉన్నప్పుడు విక్కీ వాష్‌రూమ్‌కి వెళ్లాడట. ఆ తర్వాత డైరక్టర్ పిలిచి వాష్‌రూమ్‌కి వెళ్లినప్పుడు కెమెరా ఆఫ్ చెయ్యు అని చెప్పారట. అప్పుడు కానీ విక్కీకి పరిస్థితి అర్థం కాలేదట.