Vidhi Review in Telugu: విధి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రోహిత్ నందా (Hero)
  • రోహిత్ నందా (Heroine)
  • 'రంగస్థలం' మహేష్, గౌరీశంకర్,ఎం.సురేష్ తదితరులు (Cast)
  • శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ (Director)
  • రంజిత్ ఎస్ (Producer)
  • శ్రీచరణ్ పాకాల (Music)
  • శ్రీనాథ్ రంగనాథన్ (Cinematography)
  • Release Date : నవంబర్ 3, 2023

ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఈ ‘విధి’ అనే సినిమా ఒకటి. ఆనంది, ‘రంగస్థలం’ మహేష్..లు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల తప్ప, ఈ చిత్రానికి పనిచేసిన వారంతా కొత్తవాళ్లే. అయితే టీజర్, ట్రైలర్లు కొంత వరకు ఆకట్టుకున్నాయి. మరి వాటి స్థాయిలో సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి :

కథ: సూర్య(రోహిత్ నందా) ఓ అమాయకపు కుర్రాడు. సొంత ఊర్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, జాబ్ కోసం సిటీ వస్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా.. ఒకరోజు ఇతను ఓ వ్యక్తి వద్ద పెన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. అయితే దాని విలువ రూ.40 వేలు అని అతను చెప్పగా విని షాక్ అవుతాడు. తర్వాత ఊహించని విధంగా అతనికి అలాంటి పెన్ ఒకటి దొరుకుతుంది. ఆ పెన్ ను అమ్మేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ పెన్ను కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ తర్వాత ఆ పెన్ తో ఎవరు రాస్తే వాళ్ళు చనిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో తన రూమ్ మేట్స్ అయిన ఇద్దరు స్నేహితులని పోగొట్టుకుంటాడు సూర్య. ఫైనల్ గా ఈ విషయం అతనికి అర్ధమవుతుంది. తర్వాత అతను ఆ పెన్ తో ఏం చేశాడు? మరోపక్క తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన అమ్మాయి(ఆనంది) ని సూర్య ప్రేమిస్తూ ఉంటాడు సూర్య. కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నప్పటికీ వీరిద్దరూ తమ ప్రేమ గురించి చెప్పుకోరు. ఈ క్రమంలో ఆ పెన్ వల్ల.. సూర్య లైఫ్ లో ఇంకా ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అతని లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా? అసలు ఆ పెన్ వెనుక ఉన్న కథేంటి? అనేది మిగిలిన కథ?

నటీనటుల పనితీరు: హీరో రోహిత్ నందాకి ఇది డెబ్యూ మూవీ. అతని నుండి ఎక్కువ పెర్ఫార్మన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మినిమమ్ అయినా అతను ట్రై చేయాలి. అలాంటి ప్రయత్నమైతే అతను చేసింది లేదు. చాలా ఇబ్బంది పడ్డాడు అని ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తుంది. ఇతనికి క్లోజప్ షాట్స్ కూడా ఎక్కువగా పెట్టలేదు. ఇక ఆనంది అందరికీ పరిచయమే. ఈ సినిమాలో ఆమెది హీరోయిన్ రోల్ అని అనలేం. అలా అని సహాయనటి రోల్ అని కూడా తీసిపారేయలేము.

అసలు ఇలాంటి పాత్రని ఆమె ఎలా ఎంపిక చేసుకుంది అనేది అర్ధం కాని ప్రశ్న. ఇక ‘రంగస్థలం’ మహేష్ హీరో ఫ్రెండ్ గా నటించాడు అనేకంటే.. కనిపించాడు అనడం బెటరేమో.! అతని పాత్ర కూడా పెద్దగా ఇంప్రెస్ చేసింది లేదు. ఇక మిగిలిన నటీనటుల పాత్రలు ఎవ్వరికీ రిజిస్టర్ కావు.

సాంకేతిక నిపుణుల పనితీరు: పెన్ చుట్టూ అల్లుకున్న కథ అంటే ఏదో వినడానికి.. ప్రమోషన్ చేసుకోవడానికి కూడా కొత్తగా ఉంది. ఆ ఐడియాకి దర్శకులైన శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్..లను ఇద్దరినీ మెచ్చుకోవచ్చు. కానీ సినిమాలో ఆ పెన్ గురించి ఎటువంటి కన్క్లూజన్ వారు ఇచ్చింది లేదు. అంటే ‘విధి 2’ ఉంటుంది అనే హింట్ ఇచ్చారు అనుకోవాలి. దీంతో అసలు ఇది థ్రిల్లర్ సినిమానా? లేక ఫాంటసీ సినిమానా? అనేది అర్ధం కాని పరిస్థితి. దర్శకులలో ఒకరైన శ్రీనాథ్ రంగనాథన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా అందించడం జరిగింది.

కానీ గుర్తుంచుకునేలా అయితే విజువల్స్ ఏమీ లేవు. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల ఈ మధ్య కాలంలో ఇలాంటి పేలవమైన సంగీతం ఏ సినిమాకి ఇచ్చి ఉండడు. స్క్రీన్ పై వచ్చే సీన్ కి ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సంబంధమే ఉండదు. నిర్మాత రంజిత్ ఎస్ కథకి తగ్గట్టుగా ఖర్చు చేసినట్లు ఉన్నారు. ప్రొడక్షన్ డిజైన్ చాలా వీక్ గా ఉంది. నిడివి ఒక గంట 47 నిమిషాలు మాత్రమే ఉండటం సినిమా మొత్తానికి ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

విశ్లేషణ: టీజర్, ట్రైలర్ వంటి వాటితో ఏదో ఊహించుకుని ఈ సినిమాకి వెళితే బుక్కైపోయినట్టే..! పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ వీక్ గా ఉండటంతో హత’విధి’ (Vidhi) అనుకుంటూ థియేటర్ నుండి బయటకి వచ్చేయడం గ్యారెంటీ.

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus