Vidya Balan: తన మొదటి సంపాదన గురించి చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!

  • June 17, 2021 / 06:37 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో ఆమె ఎన్టీఆర్ సతీమణి అయిన బసవతారకం పాత్రను పోషించింది. ఆ పాత్రకి విద్యాబాలన్ నూటికి నూరు శాతం న్యాయం చేసిందనే చెప్పాలి.ఎటువంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విద్యా బాలన్.. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటించి ఆరంభంలోనే స్టార్ హీరోయిన్లకి సవాళ్లు విసిరింది.

నటనతోనూ అలాగే గ్లామర్ తోనూ బి టౌన్ ను ఓ ఊపు ఊపేసింది విద్యాబాలన్.అయితే తన మొదటి సంపాదన ఎంత అనే విషయం పై ఇటీవల ఓ సందర్భంలో చెప్పి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘షేర్నీ’ అమెజాన్‌ ప్రైమ్‌ ఓటిటిలో విడుదల కాబోతుంది. ఇక దీని ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె…’నా కెరీర్ ప్రారంభంలో నేను ఓ టూరిస్ట్‌ క్యాంపైన్‌ కోసం మొదటిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చాను.

నా సిస్టర్స్ మరియు కజిన్‌ ఫ్రెండ్‌తో కలిసి టూరిస్ట్‌ క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నందుకు మాకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చారు. ఇదే నా మొదటి సంపాదన. అటు తర్వాత ఓ సీరియల్ ద్వారా పూర్తి స్థాయి నటిగా మారాను అంటూ చెప్పుకొచ్చింది విద్యా బాలన్. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus