Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్ అయిన విజయ్ – రష్మిక లవ్.. అక్టోబరు 16 గురించి కాదు కదా?
- September 26, 2026 / 01:31 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ – రష్మిక మందన.. టాలీవుడ్‌లో ఎక్కువ కాలం చర్చలో ప్రేమ పావురాలు వీరే. నేరుగా, ఇన్‌డైరెక్ట్‌గా.. రకరకాలుగా వీరు తమ ప్రేమను బయటపెడుతూనే ఉన్నారు. మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ‘మా పెళ్లా?’ అంటూ ఓ డిఫరెంట్ ప్రశ్న వేసి ఆ వైబ్‌ని ఫ్యాన్స్‌లో అలా కంటిన్యూ చేశారు. ఇప్పుడు భార్యాభర్తలు అయిపోయారు అనుకోండి. దీంతో వారి ప్రేమ ముచ్చట్లు కాస్తా ఆగిపోయాయి. మొన్నీ మధ్య రష్మిక గాయపడి కొన్ని రోజులు ఇంట్లో ఉండటంతో నాటి రోజులు మళ్లీ కాస్త చూపించింది.
Vijay – Rashmika
తిరిగి, ఇప్పుడు ఆమె షూటింగ్‌లకు వెళ్తుండటంతో ఇక ‘ప్రేమ ముచ్చట్లు’ ఉండవేమో అనుకున్నారంతా. పెళ్లికి ముందు డీప్‌గా ప్రేమించుకుని, విహారయాత్రలు చేసిన ఈ జంట ఈ సారి ఏకంగా తమ ప్రేమను సోషల్‌మీడియాకు ఎక్కించారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలసి చేసిన ‘రణబాలి’ సినిమా కోసమే ఇలా చేస్తున్నారా అనేలా సోషల్ మీడియాలో వీరి ముచ్చట్లు కనిపిస్తున్నాయి. తాజాగా సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్‌ను ట్యాగ్ చేస్తూ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘‘అతడు సర్వస్వం నాకే సొంతమయ్యాడు. కానీ అతడిపై క్రష్ మాత్రం ఇంకా తగ్గలేదు’’ అని రష్మిక రాసుకొచ్చింది. అయితే ఆమె మాటలు రియల్ లైఫ్‌కు, ఇటు ఈ సినిమాలో పాటకు సింక్ అవుతోంది. కాబట్టి సినిమా గురించే ఇలా రాసింది అనుకోవచ్చు. కానీ విజయ్ దేవరకొండ రిప్లై చూస్తుంటే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను మిక్స్ చేస్తూ ఈ సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు అని అర్థమవుతోంది. అన్నట్లు విజయ్ రిప్లై ఏంటో చెప్పలేదు కదా.. తాను అదృష్టవంతుడినని, ‘రణబాలి’లో జయమ్మను మిస్ అవుతాను కానీ, నువ్వు మాత్రం జీవితాంతం నాతో ఉంటావు అని అన్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక దేవరకొండ జంటగా నటించిన ‘రణబాలి’ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించారు. దసరా కానుకగా వచ్చే నెల 16న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ లోపు ఈ ప్రేమ ముచ్చట్లు ఇంకెన్ని చూస్తామో.
















