Vijay Antony Health Update: క్షేమంగా ఉన్నాను…ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన విజయ్ ఆంటోనీ..!

బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా ద్వార తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తెలుగు తమిళ్ భాషలలో ఈ సినిమా మంచి హిట్ అవటంతో ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఇటీవల బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుపుతుండగా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విజయ్ దవడ ఎముకలు ముక్కుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ని మలేషియాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

విజయ్ గాయపడటంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక విజయ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో విజయ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితం గానే ఉందని అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజయ్ స్వయంగా ట్వీట్ చేశాడు.

తాజాగా విజయ్ ఆంటోనీ స్వయంగా తన ఆరోగ్యం గురించి అభిమానులకు అప్డేట్ అందించారు. ఈ క్రమంలో విజయ్ ట్వీట్ చేస్తూ..” ‘నన్ను ప్రేమించే హృదయాలకు నా కృతజ్ఞతలు. నేను 90 శాతం కొలుకున్నాను. నా విరిగిన దవడ, ముక్కు ఎముకలు పూర్తిగా కలిసిపోయాయి. మీ అభిమానం,ప్రార్థనల వల్ల కోలుకొని గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్‌లో విడుదల కానున్న పిచైకారన్ 2 (బిచ్చగాడు 2) పనులను తొందరలోనే ప్రారంభిస్తాను” అంటూ తన ఆరోగ్య పరిస్తితి గురించి అప్డేట్ అందించారు.

ఇలా విజయ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విజయ్ కోలుకోవడం పట్ల అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బిచ్చగాడు సినిమాకి సీక్వల్ గా రూపొందుతున్న బిచ్చగాడు 2 సినిమా కూడా మంచి హిట్ అందుకోవాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus