Vijay Antony: విజయ్‌ ఆరోగ్యంపై స్పందించిన సన్నిహిత వర్గాలు

‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్‌ జనాలకు బాగా పరిచయమైన విజయ్‌ ఆంటోని గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై విజయ్‌ ఆంటోని టీమ్‌ స్పందించింది. వార్తల్లో వస్తున్నదంతా నిజం కాదు అంటూ వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం చూస్తే.. విజయ్‌ ఆంటోనికి తగిలినవి స్వల్ప గాయాలే అని తెలుస్తోంది. విజయ్‌ ఇప్పుడు కోలుకుంటున్నారు అని చెప్పిన టీమ్‌.. త్వరలో షూటింగ్‌ అని కూడా తెలిపింది.

‘పిచ్చైకారన్‌ 2’ (తెలుగులో బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణ మలేసియాలో జరుగుతుండగా విజయ్‌ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తొలుత వార్తలొచ్చాయి. అంతేకాదు విజయ్‌ పరిస్థితి దారుణంగా ఉందంటూ కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై తొలుత స్పందించని టీమ్‌.. తాజాగా చెన్నై మీడియాకు క్లారిటీ ఇచ్చింది.‘‘పిచ్చైకారన్‌ 2’ షూటింగ్‌లో విజయ్‌కి ప్రమాదం జరిగిన విషయం నిజమే.

అయితే విజయ్‌ నడుముకు స్వల్వ గాయమైంది. ప్రస్తుతం ఆయన గాయం నుండి కోలుకొని తన సినిమా పనులు చేసుకుంటున్నారు. అయితే సినిమా షూటింగ్‌ను ప్రస్తుతానికి వాయిదా వేశాం. మీడియాలో వస్తున్నట్టు విజయ్‌ ఆంటోనికి పెద్ద ప్రమాదం జరగలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైకి తీసుకొచ్చాం’’ అని విజయ్‌ ఆంటోని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విజయ్‌ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘పిచ్చై కారన్‌ 2’. తెలుగులో ‘బిచ్చగాడు 2’గా తీసుకొస్తున్నారు.

‘బిచ్చగాడు’ సినిమా ఘన విజయం అందుకోవడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌ కూడా అదిరిపోయాయి. ఈ సినిమా చిత్రీకరణ మలేసియాలోని లంకావి దీవిలో జరుగుతుండగా ప్రమాదం జరిగింది. జెట్‌స్కీ వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్‌కు గాయమైంది. ‘బిచ్చగాడు’తోపాటు ‘డాక్టర్‌ సలీమ్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా విజయ్‌ చేరువయ్యారు. అంతకుముందు ఆయన ‘మహాత్మ, ‘దరువు’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసి ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus