పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ చెబుతున్నారు. ఎవరు ఏం చెప్పినా అది మన దేశం మీద ఉగ్రవాదులు చేస్తున్న దాడిని ఖండించేవే. అయితే ఉగ్రవాదం నిరోధానికి చాలామంది చేస్తున్న సూచనల్లో ప్రముఖ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ చేసిన సూచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే ఇది కూడా పాయింటే కదా. ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని కూడా అంటున్నారు. అంతలా విజయ్ ఏం చెప్పాడు అనుకుంటున్నారా? చిన్న పిల్లలకు బేసిక్ నీడ్ గురించే.
సూర్య (Suriya) ‘రెట్రో’ (Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఓ అతిథిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర ఘటన బాధాకరం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా, మేం కూడా బాధ అనుభవిస్తున్నాం. బాధితులకు అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చాడు. కశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న దురాగతాలకు కారణం చదువు లేకపోవడమే అని మెయిన్ పాయింట్‌ను ప్రస్తావించాడు విజయ్. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి అని పిలుపునిచ్చాడు.
ఉగ్రదాడులు లాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకు తెలియదు. ఎవరేమన్నా కశ్మీర్ ఇండియాదే. కశ్మీరీలు మనవాళ్లే అని కుండబద్ధలుకొట్టాడు విజయ్ దేవరకొండ. తాను రెండేడేళ్ల క్రితం అక్కడ షూటింగ్‌కు వెళ్లానని, ఆ ప్రాంత వాసులు బాగా చూసుకున్నారని తెలిపాడు. పాకిస్థాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు పోతే ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు అని అన్నాడు విజయ్. జీవితంలో ముందుకు వెళ్లాంటే తాళం చెవి చదువు ఒక్కటే.
మనం, ఇంకా మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం ముందుకు వెళ్తుంది అని విజయ్ చెప్పాడు. ‘అగరం’ ఫౌండేషషన్ తరహాలో ఈ ఏడాది విద్యార్థులతో ఓ వేదికను ఏర్పాటు చేస్తాను. చదువులో నేనేమీ టాపర్‌ను కాను. కానీ, పరీక్షల సమయంలో ఎదుర్కొన్న ఒత్తిడి ఇప్పుడు జీవితంలో బాగా ఉపయోగపడుతోంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.