Actress: ఆ హీరోలా ఎవరూ డ్యాన్స్‌ చేయలేరు: విజయ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌!

స్టార్‌ కిడ్స్‌కి బాలీవుడ్‌లో చాలా ఈజీ. వాళ్లు చాలా సులభంగా స్టార్‌ హీరోలు / హీరోయిన్లు అయిపోతారు అని అంటుంటారు. నిజానిక అలా అందరూ స్టార్లు అయిపోతున్నారా? అందరికీ కెరీర్‌ కేక్ వాక్‌ లానే ఉందా అంటే లేదనే చెప్పాలి. దీనికి ఓ ఉదాహరణ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో నాలుగేళ్ల క్రితమే కెరీర్‌ ప్రారంభించిన అనన్య ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ అవ్వలేదు. అలా అని సినిమా ఛాన్స్‌లు లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఆమె ఇదే నా జీవితంలో అద్భుతమైన క్షణం అంటూ ఓ పోస్ట్‌ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో షేర్‌ చేస్తూ ఈ కామెంట్స్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె మాటలు వైరల్‌గా మారాయి. ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలై తొలుత ఫ్లాప్‌ తెచ్చుకుని ఆ తర్వాత కోలుకున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సినిమాలో ఇప్పుడు ప్రత్యేకంగా ఓపాటను యాడ్‌ చేశారు. ఈ మేరకు ఆ పాటలో అనన్య పాండే, జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌ చిందేశారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియోనే ఇప్పుడు అనన్య షేర్‌ చేసింది.

‘హార్ట్‌ త్రోబ్‌…’ అంటూ అనే ప్రత్యేక పాటను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా అనన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పాట వీడియోను పోస్ట్‌ చేస్తూ… ‘నా జీవితంలో మర్చిపోలేని అద్భుత క్షణం ఇది. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలో నేను డ్యాన్స్‌ ఆనందంగా ఉంది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే కారణం. ఆయన వల్లనే నా కల నిజమైంది. అందుకు కరణ్‌కు కృతజ్ఞతలు’’ అంటూ కరణ్‌ను పొగిడేసింది (Actress) అనన్య.

ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌తో డ్యాన్స్‌ చేయడం గురించి కూడా ఆమె మాట్లాడింది. బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌ చేసినట్లు ఎవరూ డ్యాన్స్‌ చేయలేరు అని కామెంట్‌ చేసింది. ఇక ఆమె కెరీర్‌ గురించి చూస్తే… విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ చేసింది. ఆ సినిమా తేడా కొట్టడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్‌ రాఏదు. ప్రస్తుతం ‘డ్రీం గర్ల్‌ 2’ సినిమాతో రావడానికి సిద్ధమవుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus