Vijay, Ananya: కరణ్ జోహార్ షోలో ‘లైగర్’ టీమ్!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘లైగర్’. పూరి జగన్నాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రిలీజ్ కి మూడు నెలల సమయం ఉన్నప్పటికీ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ నిన్న కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షో ఆపేస్తున్నట్లు కరణ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

అలా పెట్టిన కాసేపటికే ఈ షో ఓటీటీలో వస్తుందని చెప్పారు. మరి ఓటీటీ వెర్షన్ కోసం విజయ్ ఇంటర్వ్యూ చేశారా..? లేక ‘కాఫీ విత్ కరణ్’లో రాబోయే ఆఖరి ఎపిసోడ్ ఇదా అనే విషయంలో క్లారిటీ లేదు. ‘లైగర్’ నిర్మాణంలో కరణ్ జోహార్ కూడా భాగం కావడంతో హిందీ ప్రమోషన్స్ అన్నీ ఆయన చూసుకోబోతున్నారు. ‘లైగర్’ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ తో పాటు బాక్సింగ్ నేర్చుకున్నారు. నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు.

హిందీలో ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో దానికి తగ్గట్లే తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దేన్నీ వదిలిపెట్టడం లేదు విజయ్. కరణ్ జోహార్ కూడా అన్ని విధాలుగా విజయ్ కి సహకారం అందిస్తున్నారు. అందుకే విజయ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడమనేది పూరికి, విజయ్ కి చాలా అవసరం.

‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు విజయ్ మార్కెట్ పై ఎఫెక్ట్ చూపించాయి. అతడి క్రేజ్ తగ్గినప్పటికీ.. మార్కెట్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ‘లైగర్’ సినిమా అతడిని నిలబెడుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus