Geetha Govindam: గీతా గోవిందం సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన విజయ్ రష్మిక!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్న కలిసి పరశురాం డైరెక్షన్లో నటించిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా ద్వారా వీరిద్దరికీ ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో మనకు తెలిసిందే.కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 130 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయినటువంటి విజయ్ దేవరకొండ రష్మిక కెరియర్ పరంగా బిజీ అయ్యారు..

ఈ సినిమా ద్వారా రష్మిక మందన్న తెలుగులో మరిన్ని అవకాశాలను అందుకుంటు నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు ఈ స్థాయిలో హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. ఇలా విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించిన ఈ సినిమా ఐదు సంవత్సరాలు కావడంతో వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ గీతగోవిందం (Geetha Govindam) సినిమా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈరోజు చాలా జరుగుతున్నాయి మొదటిది ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కావడం విశేషం అలాగే మా గీతగోవిందం సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరోవైపు ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఈరోజే జరగబోతోంది అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇలా విజయ్ దేవరకొండ చేసిన ఈ ట్వీట్ అనంతరం రష్మిక కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా గీతగోవిందం ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకున్నందుకు కూడా ఈమె శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరూ ఒకే చోట చేరి సందడి చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus