Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

ప్రముఖ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, ప్రముఖ కథానాయిక రష్మిక మందన ఎంగేజ్‌మెంట్‌ జరిగింది అనేది అందరికీ తెలిసిన సమాచారమే. ఎందుకంటే విజయ్‌ టీమే ఈ విషయాన్ని అనధికారికరంగా ప్రకటించేసింది. అయితే ఏమైందో ఏమో విజయ్‌ కానీ, రష్మిక కానీ ఈ విషయంలో స్పందించడం లేదు. బయటకు వచ్చినప్పుడు ఏమైనా చెబుతారా అంటే అలా అడగడమే బాగుంది.. అడగనీయండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఈ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చేశారు.

Vijay Devarakonda

విజయ్‌ – రష్మికను మనం చాలా ఏళ్ల నుండి చూస్తున్నాం. ఎప్పుడు ఈ ఇద్దరు ఎదురుపడినా, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న ఓ లెక్కలో ఉంటుంది. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఓ హగ్‌ ఇచ్చుకుని తర్వాత కూర్చుంటారు. అయితే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో మాత్రం అలా జరగలేదు. మహారాణి దగ్గరకు మహారాజు వచ్చి అరచేతిని చేతులోకి తీసుకొని ముద్దుపెట్టినట్లు విజయ్‌ కూడా రష్మికకు ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రష్మిక, దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రల్లో రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందించిన ‘గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.భిన్న భావోద్వేగాలతో కూడిన ఈ పాత్రను రష్మిక తన అద్భుతమైన నటనతో మరోసారి అందరికీ క్రష్‌ అయి కూర్చుంది. మరి అలాంటి క్రష్‌కి త్వరలో తాళి కట్టబోతున్న విజయ్‌ ఇంకెంత సంబరపడి ఉంటాడు చెప్పండి. ఆ సంబరానికి ఉదాహరణే ఆ కిస్‌ అని చెప్పొచ్చు. ముద్దు కార్యక్రమం అవ్వగానే అభిమానులు ఈలలతో హోరెత్తించారు. రష్మిక చిరునవ్వులు చిందించింది.

ఈ లెక్కన మరోసారి తమ బంధాన్ని బహిరంగంగా చెప్పారు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఓవర్సీస్‌ ట్రిప్‌లు, ముంబయి కెఫే ముచ్చట్లు, ఒకే ఇంటిలో వేర్వేరు ఫొటోలు అంటూ చాలా ఏళ్లుగా లీకులు ఇస్తూనే ఉన్నారిద్దరూ. అన్నట్లు ఈ కార్యక్రమం వేదిక మీద విజయ్‌ పిలుపులోనూ మార్పొచ్చింది. ఇన్నాళ్లూ రష్మిక అని పిలిచిన విజయ్‌.. ఈసారి రషి అని పిలిచాడు.

హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus