సౌత్ లో ఆ ఘనత సాధించిన కథానాయకుడు విజయ్ దేవరకొండ ఒక్కడే

వరుస విజయాలు సాధించి స్టార్ డమ్ సంపాదించుకోవడం వేరు.. యూత్ లో క్రేజ్ సాధించడం వేరు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అనేది అంత సులువైన పని కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. సరిగ్గా 4 ఏళ్ల క్రితం కెరీర్ మొదలెట్టిన విజయ్ దేవరకొండ తనకంటే ముందు నుంచీ స్టార్ హీరో స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సీనియర్ & యంగ్ హీరోస్ అందర్నీ దాటుకొని వెళ్ళి.. 2019లో గూగుల్ లో వెతకబడిన టాప్ సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు.

Vijay Devarakonda With Mahesh Babu

2019లో గూగుల్ లో వెతకబడిన టాప్ సౌత్ ఇండియన్ మూవీగా “సాహో” నిలవగా.. సౌత్ ఇండియన్ మోస్ట్ సెర్చడ్ సాంగ్ గా “చిత్రలహరి” చిత్రంలోని ప్రేమ వెన్నెల నిలిచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. నార్త్ సెలబ్రిటీలను సైతం డామినేట్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ తరువాతి స్థానంలో రష్మిక కైవసం చేసుకోవడం గమనార్హం. 2020లోనూ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ ఈ ట్రెండ్ ను ఇదే తరహాలో కంటిన్యూ చేసేలా ఉన్నాడు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus