నిన్న మహేష్, నేడు విజయ్ దేవరకొండ .. లీక్ లతో సతమతం..!

గత కొంత కాలం నుండీ మన హీరోల చిత్రాల లోని కొన్ని సన్నివేశాలు ఫోటోలు లీక్ అవుతూ వస్తున్నాయి. షూటింగ్ స్పాట్ నుండీ కొన్ని ఫోటోలు, వీడియోలు లీకై ఆయా దర్శక, నిర్మాతలను కలవరపెడుతున్నాయి. గతంలో ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘అరవింద సమేత’ చిత్రాలలో కొన్ని సీన్లు లీకయ్యి సంచలనం సృష్టించాయి. ఇటీవల సమంత – నాగ చైతన్యల ‘మజిలీ’… అలాగే మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీకై..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. అయితే విజయ్ దేవరకొండకి ఇదేం కొత్తేమీ కాదు.. ఎందుకంటే గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ చిత్రాలు ఏకంగా సినిమాలే బయటకి వచ్చేసాయి.

ఇంకా అది మరిచిపోకముందే..విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరెక్షన్లో వస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం..! తాజాగా ఈ చిత్ర షూటింగ్ కొత్తగూడెంలోని కార్మిక ప్రాంతాల్లో జరగుతోంది. స్టూడెంట్ లీడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ..ఎందుకు కార్మికుల తరుపున పోరాటం చేశాడనేదే కథాంశం అనిపిస్తుంది. ఈ ఫోటోల్లో విజయ్ దేవరకొండ..ఖాకీ డ్రెస్‌లో కార్మికుల కష్టాలను తీర్చే నాయకుడిలా కనిపిస్తున్నాడు. ఇక ఈ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి విజయ్ దేవరకొండను చూసేందకు పాఠశాల విద్యార్థులు, ప్రజలు ఎగబడ్డారు. విజయ్ దేవరకొండ లుక్ ఈ చిత్రంలో కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మరోసారి రష్మిక మందన నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా ఆగష్టు లో విడుదల కాబోతుందని సమాచారం. మొదట ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలనీ భావించినప్పటికీ కొన్ని కారణాల వలన.. విజయ్ దేవరకొండకు కలిసొచ్చిన ఆగష్టు నెలకు మార్చరట. ఇదే నెలలో ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus