స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. వీక్ డేస్ లో కూడా ఖుషి మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. విడుదలకు ముందు విడుదల తర్వాత కళ్లు చెదిరే స్థాయిలో ఖుషి మూవీ లాభాలను అందిస్తుండటం గమనార్హం. ఖుషి సినిమా సక్సెస్ సాధించడంతో విజయ్ దేవరకొండ 100 మంది అభిమానుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం అందించనున్నారు. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన లింక్ ను షేర్ చేశారు.
అయితే విజయ్ దేవరకొండ సినిమా ద్వారా తమ బ్యానర్ 8 కోట్ల రూపాయలు నష్టపోయిందని అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి హీరో సినీ కెరీర్ లో జయాపజయాలు సాధారణం అనే సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు లాభాలను అందిస్తే మరికొన్ని సినిమాలు నష్టాలను మిగుల్చుతాయి. జయపజయాలకు ఏ స్థార్ హీరో కూడా అతీతం కాదు.
అయితే బ్యాగ్రౌండ్ లేని హీరో కావడం వల్లే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోల సినిమా హక్కులు కొని నష్టం వస్తే విజయ్ దేవరకొండను అడిగినట్టు బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలను అడిగే ధైర్యం ఉందా? అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఇతర వ్యాపారాలలా సినిమా అనేది కూడా బిజినెస్ అని లాభనష్టాలు కామన్ అని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను డబ్బులు అడగాలే తప్ప హీరోను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్లే అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు విజయ్ దేవరకొండను (Vijay Devarakonda) టార్గెట్ చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!