Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కు షాక్ ఇచ్చిన లేడీ అభిమాని.. విజయ్ ఏం చేశాడో తెలుసా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కు షాక్ ఇచ్చిన లేడీ అభిమాని.. విజయ్ ఏం చేశాడో తెలుసా?

  • September 3, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ కు షాక్ ఇచ్చిన లేడీ అభిమాని.. విజయ్ ఏం చేశాడో తెలుసా?

లైగర్‌ సినిమాతో భారీ డిజాస్టర్‌ ఎదుర్కొన్న హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఖుషి ఖుషీగా ఉన్నాడు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను నటించిన లేటెస్ట్‌ సినిమా ఖుషి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే విడుదలైన రెండు రోజుల్లోపే బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఖుషి విజయోత్సాహంలో ఉన్న విజయ్‌ దేవరకొండ ఆదివారం (సెప్టెంబర్‌ 3)న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్‌ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ యాదాద్రీశుడి ఆశీస్సులు అందుకున్నారు.

వీరి వెంట ఖుషి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు వై. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆధికారులు ఖుషి టీమ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దర్శనానంతరం విజయ్ దేవరకొండతో పాటు ఆయన కుటుంబసభ్యులను బయటకు వస్తున్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది. ఒక అమ్మాయి విజయ్‌ దేవరకొండ దగ్గరకు పరుగెత్తుకు వచ్చి అతనిని హత్తుకునేందుకు ప్రయత్నించింది.

అయితే పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే ఆ అమ్మాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని ఏమి అనవద్దని పోలీసులకు సర్ది చెప్పారు. ఆ లేడీ ఫ్యాన్‌తో మాట్లాడి ఫొటోలు కూడా దిగారు. తమ అభిమాన హీరోతో కలిసి ఫొటో దిగిన ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో మీడియాతో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది తమ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందన్నారు రౌడీ బాయ్‌. ‘ మా బ్రదర్ ‘(ఆనంద్‌ దేవరకొండ) బేబీ సినిమా, నేను నటించిన ఖుషి రెండూ విజయవంతమయ్యాయి. అందుకే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చాను. మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉంది. పునర్మిర్మాణంలో యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతులు. మాలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarakonda

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

3 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

4 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

4 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version