పులులతో, పాములతో విజయ్ దేవరకొండ వింత సాహసాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో

విజయ్ దేవరకొండ .. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు. ఇంకా చెప్పాలంటే మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ 1 హీరో అనుకోవచ్చు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్విలా’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత హీరోగా మారి ‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

తర్వాత పలు ప్లాప్ లు ఎదురైనా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. గతేడాది వచ్చిన ‘లైగర్’ మూవీ పెద్ద డిజాస్టర్ అయినా త్వరలో రానున్న ‘ఖుషి’ పై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి అరబ్ దేశం వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. అక్కడ ప్రతి ఒక్క మూమెంట్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

తాజాగా పులులు, సింహాలు, పాములతో ఆడుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో పాములను మీద వేసుకోవడం హైలెట్ గా నిలిచింది. చాలా భయానకంగా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ వీడియోను చూసిన విజయ్ అభిమానులు ‘రౌడీనా.. మజాకా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

\

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus