విజయ్ దేవరకొండ, (Vijay Devarakonda) రష్మిక మందన (Rashmika) ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఈరోజు అనగా అక్టోబర్ 3న మధ్యాహ్నం విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు, సినీ విశ్లేషకులు వారికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ టీం కూడా ఈ న్యూస్ విషయంలో సైలెంట్ గా ఉండటంతో.. అది నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది.
సాధారణంగా ఏమైనా ఫాల్స్ ఇన్ఫో సర్క్యులేట్ అయితే వాళ్ళు ఖండిస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా చేయకపోగా.. స్మైల్ ఇచ్చి సైలెన్స్ మెయింటైన్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక..ల ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ఏవీ బయటకు రాలేదు. ‘గీత గోవిందం’ సినిమా టైంలో విజయ్ దేవరకొండ, రష్మిక..ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ సినిమా టైంలోనే వీరి మధ్య స్నేహం పుట్టింది. తర్వాత అది ప్రేమగా కూడా మారింది. ఆ సినిమా విడుదల సమయంలో రష్మిక.. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది.
కానీ తర్వాత వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ‘గీత గోవిందం’ రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక..ల (Rashmika) మధ్య ప్రేమ చిగురించడం వల్లనే రక్షిత్ శెట్టితో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను వీళ్ళు తోసిపుచ్చారు. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా వీళ్ళు కలిసి నటించడం జరిగింది. బాలీవుడ్లో అయితే విజయ్- రష్మిక..ల గురించి బోలెడన్ని కథనాలు పుట్టుకొచ్చాయి. మొత్తానికి వాళ్ళు తమ 7 ఏళ్ళ లవ్ జర్నీని పెళ్లితో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారని అర్ధం చేసుకోవచ్చు.