Vijay Devarakonda: స్టార్ డైరెక్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన విజయ్.. షాక్ లో టాలీవుడ్..!

అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో రాజమౌళి తరువాత అవలీలగా ఆ లిస్ట్ లో ఉంటాడు దర్శకుడు కొరటాల శివ. అతను తెరకెక్కించే సినిమాలన్నిటిలో ఓ సామజిక అంశాన్ని ఇమడ్చడం తో పాటు అభిమానులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా జోడిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఇతను తెరకెక్కించిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్లే..! ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల.. తరువాతి చిత్రాన్ని ఎన్టీఆర్ తో తెరకెక్కించనున్నాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా కొరటాల.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చెయ్యాలని భావించి అతని వద్దకు వెళితే.. అతను నొ చెప్పాడట. దాంతో టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైనట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలనన్నిటినీ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో చేస్తున్నట్టే.. కొరటాల కూడా భవిష్యత్తులో చెయ్యబోయే సినిమాలు అన్నిటినీ ‘యువ సుధా ఆర్ట్స్’ అధినేత సుధాకర్ మిక్కిలినేనితో కలిసి చెయ్యాలని డిసైడ్ అయ్యాడట.

అంతేకాదు కొరటాల కూడా ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ తో కలిసి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఇందులో భాగంగానే మొదటి ప్రాజెక్ట్ ను వెంకీ కుడుముల డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో చెయ్యాలని.. అతన్ని సంప్రదించగా.. ఇందు విజయ్ నొ చెప్పాడట. మరో రెండు సంవత్సరాల పాటు విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలనే ఇలా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus