త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ దేవరకొండ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ‘సాహో’ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ‘బాహుబలి’ సినిమాని హిందీలో ప్రమోట్ చేసింది కరణ్ జోహార్. ఇక భాహుబలి కారణంగా ప్రభాస్, కరణ్ కి మధ్య స్నేహం కుదరడంతో బాహుబలి సినిమా తరువాత బాలీవుడ్ లో ప్రభాస్ తో కలసి కరణ్ ఒక సినిమా చేయాలనీ భావించాడట, కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఆఫర్ హీరో విజయ్ దేవరకొండకి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ముంబై లో కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ అనే టివి షో కి వెళ్లిన ఒకప్పటి స్టార్ నటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ ని కరణ్ జోహార్, ఒకవేళ నువ్వు రోజు ఒక మెల్ యాక్టర్ లాగా నిద్ర లేవాలనిపిస్తే ఎవరిలా లేస్తావు ఎందుకు అని అడుగగా, దానికి విజయ్ దేవరకొండ అని జవాబిచ్చి, నాకు హీరో విజయదేవరకొండ యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం అని తనతో కలసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండ సినిమా చేస్తానని తన మనసులో మాటని చెప్పేసింది.

ఇక ఇదే విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించగా, నాకూడా జాన్వీ తో చేయడం ఇష్టమేనని ఇటీవలే టాక్సీవాలా సినిమా ప్రమోషన్ సమయంలో కరణ్ జోహార్ ఆఫీస్ కి కూడా వెళ్లినట్లుగా చెప్పాడు. దీంతో విజయ్ దేవరకొండ, జాన్వీ తో కలసి కరణ్ జోహార్ కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కరణ్ జోహార్ హీరో ప్రభాస్ కోసం అనుకున్న కథతోనే విజయదేవరకొండ తో సినిమా చేస్తాడనే రూపర్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే తమిళ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus