Vijay Devarakonda: జనగణమన సినిమా షూటింగ్ నిజంగానే వాయిదా పడిందా.. విజయ్ కామెంట్స్ అర్థం అదేనా?
- September 14, 2022 / 12:35 PM ISTByFilmy Focus
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం లైగర్.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచునాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఆగస్టు 25వ తేదీ ఊహించని స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా రిజల్ట్ తో సైలెంట్ అయ్యారు.
ఇక ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో పూరి జగన్నాథ విజయ్ దేవరకొండతో చేస్తున్నటువంటి తన తదుపరి చిత్రం జనగణమన.ఈ సినిమా పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా నిర్మాతలు సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.

ఇలా ఈ సినిమా ఆగిపోయిందని తిరిగి నిర్మాతలు ఈ సినిమా షూటింగ్ పనులను కూడా నిలిపివేశారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇక జనగణమన సినిమా గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఒకవైపు పూరి జగన్నాథ్ ఏ విధంగానూ స్పందించలేదు. ఇలా ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో ఈ వార్తలలో నిజాముందని చాలామంది భావిస్తున్నారు.

ఇకపోతే సైమా అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండకు విలేకరుల నుంచి జనగణమన సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా జనగణమన సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ సినిమా గురించి మర్చిపోండి మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం ముందు ఎంజాయ్ చేయండి అంటూ ఈ ప్రశ్నను దాటవేయడంతో నిజంగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని పలువురు భావిస్తున్నారు.
బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

















