Vijay Devarakonda: హాట్ టాపిక్ అయిన విజయ్ స్పీచ్.. అవి లేకుండానే..!

విజయ్ దేవరకొండ స్పీచ్ అంటే.. కొంచెం హడావుడి కనిపిస్తుంది. ‘వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్’ అంటూ మొదలుపెట్టి.. మధ్యలో కొంచెం కాంట్రోవర్సీ గా మాట్లాడి.. ఏదో ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు.

Vijay Devarakonda

సినిమా మిస్ ఫైర్ అయితే విజయ్ ను ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ‘లైగర్’ ‘ది ఫ్యామిలీ స్టార్’ విషయంలో ఇదే జరిగింది. అయితే ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం విజయ్ అలాంటి వాటికి స్కోప్ ఇవ్వలేదు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… “మరో 2 రోజుల్లో అంటే జులై 31న మిమ్మల్ని థియేటర్లలో ‘కింగ్డమ్’ తో కలవబోతున్నాం. లోపల చాలా భయం ఉంది, అలాగే ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి కూడా ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్ పుట్ తో అందరం హ్యాపీ. ఈరోజు నేను ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ నిర్వహించారు. దాదాపు 2 వేల మందిని కలిశాను. అందులో చాలా మంది ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’ అన్నారు. ‘నువ్వు కాదు మనం అన్నారు’. నన్ను మీ వాడిగా చేసేసుకున్నారు. నా సక్సెస్ కోసం మీరంతా ఎదురుచూస్తున్నారు. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. ఇంతకు ముందు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుండి కోరుకున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. 2 ఏళ్ళుగా ఇదే ప్రాజెక్టుపై ఉన్నాడు. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేదు. అలాగే టీం అందరూ కూడా చాలా కష్టపడి పని చేశారు.ఈ ‘కింగ్డమ్’ వాళ్లందరిదీ” అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ ఎక్కడా బ్యాలన్స్ తప్పలేదు.

 

వాళ్లు ఎంత కాదన్నా.. ‘ఆ నలుగురు’ వాళ్లే: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus