నిన్న విడుదలైన “డియర్ కామ్రేడ్”కి ఊహించని స్థాయిలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా బాగా ల్యాగ్ అయ్యిందని కొందరు.. చేసిన పబ్లిసిటీకి సినిమాకి సంబంధం లేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తుండగా.. విజయ్ ఫ్యాన్స్ మాత్రం లేడీ సెంట్రిక్ సినిమాలో విజయ్ నటించడమే పెద్ద విషయంగా మెచ్చుకొంటున్నారు. అలాగే.. ఒక వర్గం ప్రేక్షకులు కూడా “డియర్ కామ్రేడ్” విజయ్ చేసిన పెద్ద సాహసమని పేర్కొంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. సెకండాఫ్ సినిమా విషయంలో డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉందని టాక్ వినబడుతోంది. దర్శకుడు రాస్కోన్న పాయింట్ కి విజయ్ మరీ ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చేసి ల్యాగ్ అవ్వడానికి ముఖ్యకారకుడయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం రెగ్యులర్ సినిమా లవర్స్ “డియర్ కామ్రేడ్” అవుట్ పుట్ తో మాత్రం అంత సంతోషంగా లేరు. హైప్ పుణ్యమా అని మొదటిరోజు 11 కోట్ల షేర్ బాగానే కలెక్ట్ చేసింది కానీ.. రివ్యూలు, మౌత్ టాక్ వల్ల ఆ పాజిటివిటీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.