విజయ్ వ్యాపారానికి బన్నీని భలే వాడేస్తున్నాడు

నేడు అల్లు అర్జున్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. “చెప్పిన ప్రకారం నాకు బట్టలు పంపించినందుకు థాంక్స్ డియర్ బ్రదర్..అలవైకుంఠపురంలో విజయోత్సవ వేడుకలో నేను ఈ డ్రెస్ వేసుకుంటాను” అని చెప్పడంతో పాటు రౌడీ బ్రాండ్ యాష్ ట్యాగ్ వేశారు. విజయ్ దేవరకొండ బన్నీకి బట్టలు బహుమతిగా ఎప్పుడు ఇస్తానన్నాడు, అన్నది పక్కన పెడితే… పరోక్షంగా విజయ్ దేవరకొండ బన్నీని తన వ్యాపారానికి వాడేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో ఒకరుగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు రౌడీ బ్రాండ్ గార్మెంట్స్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం విజయ్ వ్యాపారానికి చాల కలిసొచ్చే అంశం. ఇక నిజంగా బన్నీ అల వైకుంఠపురంలో చిత్ర సక్సెస్ మీట్ లో రౌడీ బ్రాండ్ బట్టలు వేసుకొని కనిపిస్తే సేల్స్ అమాంతంగా పెరుగుతాయి.

హీరోగా ఓ పక్క దూసుకెళుతూనే అనేక వ్యాపారాలు చేస్తున్నారు విజయ్. బ్యాక్ గ్రౌండ్ లేని స్టార్ డమ్ కి గ్యారంటీ ఉండదు. ఎప్పుడైనా సినిమా అవకాశాలు తగ్గిపోయే అవకాశం కలదు. అందుకే తెలివిగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. రౌడీ బ్రాండ్ బట్టలు, మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లతో పాటు ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించి మొదటి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కాకపోయినా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడంతో బాగానే లాభాలు గడించినట్టు సమాచారం. ఇక విజయ్ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 14న ప్రేమికుల రోజు కానుగ విడుదల కానుంది. ఆ చిత్రం తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీలో నటిస్తారు. ఏదిఏమైనా చాలా మంది యంగ్ హీరోలు ఇమేజ్ ని క్యాష్ గా ఎలా మార్చుకోవాలో విజయ్ ని చూసి నేర్చుకోవాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus