Vijay Devarakonda: కుటుంబంతో కలిసి యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సైతం ఎలాంటి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఖుషి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా తన తల్లిదండ్రులు తమ్ముడితో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకున్నటువంటి ఈయనకు అక్కడ అధికారులు ఘనస్వాగతం పలకడమే కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసే స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ ఏడాది మాకు ఎంతో స్పెషల్ అని తెలియజేశారు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అదేవిధంగా ఖుషి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుందని తెలిపారు.ఇలా ఇద్దరు సినిమాలు సక్సెస్ కావడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపడం కోసమే ఈ ఆలయానికి వచ్చామని తెలిపారు.

తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ఈ ఆలయానికి వచ్చానని ఆలయం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఇక ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ఈయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక మా చిత్ర నిర్మాతలు మైత్రి వారు కూడా సంతోషంగా ఉండాలని వారి బ్యానర్ లో తెరికేక్కిన రెండు సినిమాలు కూడా నేషనల్ అవార్డుకు ఎంపిక అయ్యాయని, అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని కోరుకున్నాం అంటూ విజయ్ తెలిపారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus