“టాక్సీవాలా” విడుదలై సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడందరూ హీరోహీరోయిన్స్ ను, దర్శకుడ్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కానీ.. అసలు సినిమా విడుదలకు ముందు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి తప్ప మరెవరికీ సినిమా మీద నమ్మకం లేదు. సినిమాను పైరసీలో చూసిన ఆడియన్స్ అయితే.. సినిమా గ్యారెంటీ ఫ్లాప్ అని ఫిక్స్ అవ్వడమే కాదు ఈ సినిమాని డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో రిలీజ్ చేయండి అని కామెంట్స్ కూడా చేశారు. నిర్మాతలైతే ఆ ఆలోచన చేశారు కూడా. కానీ.. దర్శకుడు సినిమా మీద పెట్టుకొన్న నమ్మకమే థియేటర్లో రిలీజయ్యేలా చేసింది. అయితే.. వీళ్ళందరికంటే ఎక్కువగా సినిమాను నమ్మింది, తప్పకుండా హిట్ అవుతుందని బిలీవ్ చేసింది మాత్రం విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు మాత్రమే.
ఆయన మాత్రమే సినిమా హిట్ అవుతుందని గట్టిగా నమ్మాడు. తన సన్నిహితుల వద్ద, సినిమా టీం దగ్గర “టాక్సీవాలా” రిలీజ్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా “ఆ సినిమా మంచి కాన్సెప్ట్ తో రూపొందింది, ఎప్పుడు రిలీజైనా కూడా సూపర్ హిట్ అవుతుంది, ఇది కన్ఫర్మ్” అని చెప్పేవాడట. ఎవరైనా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడినా సహించక.. వెంటనే సమాధానం చెప్పేవాడట. ఇప్పుడు విజయ్ దేవరకొండ తండ్రి నమ్మకం నిలబడడమే కాక సినిమాకి మంచి పేరు వస్తుండడంతో తమను బిలీవ్ చేసిన గోవర్ధనరావుగారికి టాక్సీవాలా టీం అందరూ కృతజ్ణులై ఉంటున్నారు.