అక్కినేని నాగేశ్వర్రావుగా అర్జున్ రెడ్డి!
- September 18, 2017 / 04:38 PM ISTByFilmy Focus
సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో బయోపిక్ “మహానటి” చిత్రంలో కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి ఆర్టిస్టులందరూ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ భారీ క్యాస్టింగ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేరాడు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ “మహానటి”లో ఎంజీయార్ పాత్ర పోషిస్తుండగా.. విజయ్ దేవరకొండ అక్కినేని నాగేశ్వర్రావుగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
నాగేశ్వర్రావుగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కు ఎంతవరకూ న్యాయం చేస్తాడు అనే విషయం పక్కన పెడితే.. “అర్జున్ రెడ్డి”గా యారోగెంట్ గా అదరగొట్టిన విజయ్ దేవరకొండ సౌమ్యుడు, మృధు స్వభావి అక్కినేని నాగేశ్వర్రావుగా సదరు క్యారెక్టర్ లో ఎంతవరకూ జీవించగలడు అనేది ఇక్కడ ప్రశ్నార్ధకం. చూద్దాం విజయ్ బాబు నాగేశ్వర్రావుగా ఏమేరకు ఆకట్టుకుంటాడో.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















