విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తక్కువ టైమ్లోనే స్టార్-డం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘ గీత గోవిందం’ (Geetha Govindam) ‘టాక్సీ వాలా’ (Taxiwaala) వంటి వరుస హిట్లతో విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. అయితే ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) ‘ఖుషి’ (Kushi) వంటి సినిమాలకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ.. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అవి పెర్ఫార్మ్ చేయలేదు. అయినప్పటికీ విజయ్ ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు.
సినిమా సినిమాకి అతని మార్కెట్ పెరుగుతూనే ఉంది. తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా విజయ్ దేవరకొండ సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అతని సినిమాలకి మంచి బిజినెస్ జరుగుతుంది. అందుకే విజయ్ పారితోషికం కూడా సినిమా సినిమాకి పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం విజయ్.. ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ అక్షరాలా రూ.47 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. ఒక్క సినిమాకి రూ.20 కోట్లు తీసుకుంటున్న విజయ్..
ఈ ఒక్క సినిమాకి అంత అందుకోవడం ఏంటి అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. విషయం ఏంటంటే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దీంతో విజయ్ ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాలి. అందుకోసమే విజయ్ అంత మొత్తం డిమాండ్ చేసినట్లు సమాచారం. విజయ్ అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ (Satya Dev) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.