పెళ్లిచూపులు సమయంలో ఎంతో ఒద్దికగా కనిపించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఆటిట్యూడ్ మార్చారు. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆవేశంతో మాట్లాడారు. ఈగో పర్సన్ గా కనిపించారు. ఆ సినిమాలో పాత్రకు, అతను ప్రవర్తించే తీరుకు కనెక్ట్ అయింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈగో కూడా బాగా పెరిగిందని సినీ జనాలు చెప్పుకోవడం మొదలు పెట్టారు. అయితే గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆవేశాన్ని తగ్గించారు. నెమ్మదిగా, అలోచించి మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఆడియో రిలీజ్ వేడుకలో అయితే పెద్దల కాళ్లకి మాత్రమే కాదు, హీరోయిన్ గా నటించిన రష్మిక కళ్ళకు కూడా నమస్కారం పెట్టడానికి వెళ్లి నవ్వులు పూయించారు. దీంతో విజయ్ పూర్తిగా మారిపోయారని ఫిక్స్ అయ్యారు. కానీ అతని ఈగో మళ్ళీ బయట పడింది. నిన్న వైజాక్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అదే ఆవేశం, ఆటిట్యూడ్ తో మాట్లాడి చర్చకు తెరలేపారు.
“నేను చిన్నప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఎదిగాను. నాకు పోరాటాలు కొత్తేమి కాదు. ఎలాంటి సమస్యనైనా పోరాడి గెలవడం నాకు తెలుసు. నేను పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నాను అంటూ కొందరు నాపై నెగిటివ్ కామెంట్స్ చేయడం బాథ కలిగిస్తోంది” అంటూ విజయ్ తన మాటలలో ఈగో ను బయటపెట్టుకున్నాడు. అంతేకాదు “నేను అనుకున్నది సాధిస్తానను. ఆ నమ్మకం నాకు ఉంది. ‘గీత గోవిందం’ సినిమాను చూసి అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఈమూవీ సక్సస్ ను ఎవరు ఆపలేరు” అని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలాఉంటుందో రెండు రోజుల్లోనే తెలియనుంది.