‘పఠాన్‌’ కోసం ట్వీట్‌.. ‘వారసుడు’ గుర్తుకు రాలేదా విజయ్‌?

తమిళ్‌లో స్టార్‌ హీరో అయిన విజయ్‌.. నాకు కాఫీ కప్పు తీసుకొచ్చి ఇచ్చారు.. అంటూ ఆ మధ్య ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ ‘కాఫీ’ సంగతి మనకు తెలియదు కానీ.. ‘వారసుడు’ సినిమాను విజయ్‌ అస్సలు పట్టించుకోకపోవడం మాత్రం నిజం. సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పుడు కనీసం ట్వీట్‌ కూడా చేయలేదు విజయ్‌. అదేంటి ట్వీట్‌ కనిపించింది కదా అంటారా? అవును నిజమే అది ‘వారసుడు’ది కాదు.. ‘వరిసు’ది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా?

మొన్నీమధ్య ‘వారసుడు’ వాయిదా వేస్తున్నప్పుడు దిల్‌ రాజు ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. అందులో ఓ విలేకరి మాట్లాడుతూ ‘విజయ్‌ తెలుగు సినిమా ప్రచారానికి వస్తారా?’ అని అడిగారు. దానికి దిల్‌ రాజు మాట్లాడుతూ ‘ట్రై చేస్తాం, వస్తాడు అనుకుంటున్నా’ అని చెప్పారు. అయితే ఆయన రావడం సంగతి పక్కన పెడితే.. కనీసం తెలుగులో సినిమా ట్రైలర్‌ వచ్చినప్పుడు ట్వీట్‌ కూడా చేయలేదు. అసలు ‘వారసుడు’ అనే పోస్టర్‌, వీడియో ట్వీట్స్‌లో కనిపించడం లేదు.

దీంతో అసలు విజయ్‌కి ‘వారసుడు’ గుర్తుందా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ‘వరిసు’ గురించి చెబితే.. ‘వారసుడు’ గురించి చెప్పినట్లే అంటారా? ఆ కవరింగ్ ఇక్కడ వర్కౌట్‌ కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మార్కెట్‌ ఉంది అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ సినిమా ట్వీట్లు కూడా ఇక్కడ ఉండాలి. అయితే ఇక్కడే ఓ పాయింట్‌ ఉంది. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైతే ట్వీట్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపాడు విజయ్‌.

సొంత సినిమా తెలుగు వెర్షన్‌ కోసం కనీసం ట్వీట్‌ చేయని విజయ్‌ కోసం.. ఇక్కడ నిర్మాత దిల్‌ రాజు థియేటర్ల కోసం పోరాటం చేస్తున్నారు. తీవ్రంగా శ్రమించి కాస్త తగ్గి 14కి మారారు. ఇదంతా చూస్తుంటే దిల్‌ రాజు చేసిన పోరాటం వృథా అయ్యింది అనిపిస్తోందా? అందులో మా తప్పేం లేదు. ఆయన హీరోను కనీసం ప్రచారానికి కూడా తీసుకు రాకపోవడం మన తప్పు ఎలా అవుతుంది. అయినా దిల్‌ రాజు ‘వారసుడు’ – ‘వరిసు’ ట్వీట్ల లాజిక్‌కి ఏం సమాధానం చెబుతారో ఏంటో?

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus