Vijay, Tiger Shroff: ఓ రోజు థియేటర్‌లో విజయ్‌ ఏం చేశాడంటే!

విజయ్‌కు తమిళనాటే కాదు, తెలుగునాట కూడా చాలామంది అభిమానులున్నారు. అందుకే ఆయన సినిమాలు వస్తే థియేటర్ల వెళ్లి, ఆ ఎలివేషన్స్‌కి, ఎంట్రీలకు విజిల్స్‌, పేపర్లు వేస్తుంటారు. అలాంటి విజయ్‌ ఓ హీరో కోసం విజిల్స్‌ వేసి, థియేటర్‌లో రచ్చ రచ్చ చేశాడు అంటే నమ్ముతారా. అందుకే హీరోగా కాకముందో, హీరో అయిన తొలినాళ్లలో కాదు. రీసెంట్‌గా గతేడాదే ఆ పని చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు, విజయ్‌ ఏం చేశాడంటే…

విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ఆయనతో పని చేసిన నటులు, దర్శకులు కలసి ట్విటర్‌ ఓ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌తో తమకున్న అనుబంధం, అతని గురించి కొన్ని ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ క్రమంలో విజయ్‌ రీసెంట్‌గా ఓ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి.. తమ అభిమాన హీరో వచ్చినప్పుడు సందడి చేసిన విషయం చెప్పారు కథానాయిక మాళవిక మోహనన్‌. అన్నట్లు ఇదంతా జరిగింది ‘మాస్టర్‌’ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనట.

‘మాస్టర్‌’ సినిమా షూటింగ్‌ ముంబయిలో జరుగుతున్నప్పుడు టీమ్‌ మెంబర్స్‌ అంతా కలసి థియేటర్‌కు వెళ్లి ‘బాఘీ 3’ సినిమా చూశారట. అందులో హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఎంట్రీ సీన్‌ రాగానే… విజయ్‌లో అసలు సిసలు టైగర్‌ ఫ్యాన్‌ బయటకు వచ్చాడట. ‘నా తలైవా..’ అంటూ ఆనందంగా అరచి గోల చేశాడట. అది చూసి చిత్రబృందం ఆశ్చర్యపోయిందట. విజయ్‌కి టైగర్‌ అంటే అంత ఇష్టమా అని ముచ్చటపడిందట. సో విజయ్‌ ఫ్యాన్స్‌… చూసుకోండి మరి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus