విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత తన టాలెంట్ తో మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుని స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియా లెవెల్లో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ్ తో సమానంగా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూనే మరోపక్క హీరోగా ‘మహారాజ’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విజయ్ సేతుపతి నుండి ‘ఏస్’ అనే సినిమా వచ్చింది.
థియేటర్లలో ఇది పెద్దగా ఆడలేదు కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక విజయ్ సేతుపతి మాట్లాడే విధానం కూడా అందరికీ నచ్చుతుంది. చాలా నాచురల్ గా మాట్లాడుతూ ఉంటాడు అతను. తాజాగా అతను ట్రోల్స్, రివ్యూస్ గురించి మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ” సినిమా అనేది ప్రేక్షకులకి నచ్చాలని, ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాము. వారు ఆదరిస్తారనే నమ్మకంతోనే వారి ముందుకు తీసుకెళ్తాము. కానీ సినిమాని ఇలాగే చూడాలని మేము చెప్పడం కరెక్ట్ కాదు. మేము వండి వడ్డించిన వంటకం వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారు అనేది వారి ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది.
వాళ్ళు నచ్చలేదు అని చెబితే తీసుకోవడానికి మేము రెడీగా ఉండాలి. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాలి. తర్వాత సరిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మాపై ఉంటుంది.డైరెక్ట్ గా అది కూడా మాకు పెద్ద లెసన్ లాంటిదే” అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి ‘సార్ మేడమ్’ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.