Vijay Sethupathi: చరణ్ బుచ్చిబాబు మూవీపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ లో (Game Changer) తన పార్ట్ కు సంబంధించిన షూట్ ను రామ్ చరణ్ ఇప్పటికే పూర్తి చేయగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కథ మొత్తం నాకు తెలుసని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి కామెంట్స్ తో చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్, జాన్వీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేననే సంగతి తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi) శ్రీదేవి (Sridevi) కాంబో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ సైతం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా మైత్రీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బుచ్చిబాబు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ చరణ్ ఇతర భాషల్లో కూడా క్రేజ్ పెంచుకుంటుండగా తర్వాత సినిమాలు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus