సినిమా వివాదం.. హీరో కూతురిపై టార్గెట్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించాలనుకున్నారు. దీనికి ‘800’ అనే టైటిల్ ని ఫైనల్ చేస్తూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అప్పటినుండి విజయ్ సేతుపతిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి మురళీధరన్ అని.. అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్‌ సేతుపతి ఎలా నటిస్తాడంటూ తమిళ సంఘాలు మండిపడ్డాయి. ట్విట్టర్ లో నెటిజన్లు విజయ్ ని టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేశారు.

ఒకానొక దశలో ఈ విమర్శలు హద్దుదాటి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే స్థాయికి వెళ్లాయి. రితిక్ అనే ట్విట్టర్ యూజర్ విజయ్ సేతుపతి గనుక ‘800’ ప్రాజెక్ట్ నుండి తప్పుకోకపోతే.. ఆయన మైనర్ కుమార్తెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. ఈ ట్వీట్ చూసిన విజయ్ అభిమానులు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. అతడిని జైల్లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సింగర్ చిన్మయి.. రితిక్ పెట్టిన ట్వీట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”పబ్లిక్ గా ఓ బాలిక రేప్ చేస్తానంటూ బెదిరించడం క్రిమినల్ యాక్ట్ అని.. ఈ సమాజాన్ని మార్చే వారే లేరా..?” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై స్పందించిన డీఎంకే ఎమ్ పి సెంధిల్ కుమార్.. ”అసలు వాడు మనిషేనా..? అలాంటి వాడిని పట్టుకొని జైల్లో పెట్టండి” అంటూ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. విజయ్ సేతుపతిపై జరుగుతోన్న ఈ ట్రోలింగ్ పై స్పందించిన ముత్తయ్య మురళీధరన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమా చేయడం వల్ల విజయ్ సేతుపతి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవాలని మురళీధరన్ కోరారు. మురళీధరన్ విజ్ఞప్తి మేరకు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే విజయ్ సేతుపతికి బదులుగా మరో నటుడిని నిర్మాతలు ఎంపిక చేస్తారని.. తన బయోపిక్ త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus