ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర రంగస్థలం జగపతి బాబులా..!
- February 14, 2020 / 08:52 PM ISTByFilmy Focus
కొద్దిరోజుల క్రితం ఉప్పెన సినిమా నుండి తమిళ హీరో విజయ్ సేతుపతి పాత్రను పరిచయం చేశారు. ఆయన ఈ చిత్రంలో రాయణం అనే పాత్ర పోషిస్తున్నారు అంబాసడర్ పక్కన సీరియస్ గా నిల్చుని ఉన్న ఆయన లుక్ ఆసక్తికరంగా ఉంది. ఐతే సినిమాలో ఆయన పాత్రపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిది విలన్ రోల్ అట. అలాగే ఆయన పాత్ర రంగస్థలం సినిమాలో జగపతి బాబు పోషించిన పశుపతి పాత్రను పోలివుంటుందట.

దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో రంగస్థలం సినిమాలో జగపతి బాబు పాత్రను పోలి ఉండేలా ఆయన పాత్ర రాసుకున్నారట. ఇక ఆచిత్రంలో జగపతి బాబు చాలా క్రూరంగా, జుగుప్స కలిగేలా ఉంటుంది. ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర కూడా చాలా కఠినంగా ఉంటుంది తెలుస్తుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!












