Vijay: విజయ్‌ సినిమాను కూడా లోకేశ్‌ అందులో కలిపేస్తున్నారా?

  • July 4, 2022 / 03:01 PM IST

మొన్నీమధ్య వరకు లోకేశ్ కనగరాజ్‌ సినిమా అంటే.. ఏ జోనర్‌ అని అడిగేవారు. ఇప్పుడు దానికి మరో ప్రశ్న యాడ్‌ అయ్యింది. అదే ఈ సినిమా LCU కిందకి వస్తుందా? లేదా? అని. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ తర్వాత కోలీవుడ్‌లో అందరూ LCU గురించే మాట్లాడుతున్నారు. అంటే లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌. అలా విజయ్‌తో త్వరలో మొదలుపెట్టబోయే సినిమా కూడా దీని కిందకే వస్తుంది అని చెబుతున్నారు. గతంలో ఈ పుకారు వచ్చినా ఇప్పుడు మళ్లీ జోరు మొదలైంది.

కార్తి ‘ఖైదీ’ సినిమాతో లోకేశ్‌ తన సినిమాటిక్‌ యూనివర్స్‌ను ప్రారంభించారు. అయితే ఆ విషయం అప్పుడు ఎవరికీ తెలియదు. ఆ సిఇనమాకు సీక్వెల్‌ ఉంటుంది అని మాత్రమే అనుకున్నారు. అయితే ఆ సినిమాకు లింక్‌గా చాలా సినిమాలు వస్తాయని. అందులోని పాత్రలు, పాత్ర చిత్రణలు, కథ అంతా కలిపి లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ అని అంటారని ఎవరూ ఊహించలేదు. అయితే ‘విక్రమ్‌’ సినిమా వచ్చాక, అందులో ‘ఖైదీ’లోని ఢిల్లీ పాత్రను కలపడంతో అసలు విషయం అర్థమైంది.

ఈ క్రమంలో లోకేశ్‌ త్వరలో విజయ్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ఎల్‌సీయూ కిందకి వస్తుందా? అని ఆ మధ్య అడిగితే ‘ఏమో అవ్వొచ్చు, కాకపోవచ్చు’ అని చెప్పారు లోకేశ్‌. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా ‘ఎల్‌సీయూ’ కిందకే వస్తుంది అని చెబుతున్నారు. అంటే ఇందులో ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాల పాత్రలు, రిఫరెన్స్‌లు, వాయిస్‌లు, కామియోలు కనిపిస్తాయి. ప్రస్తుతం వీటి మీద లోకేశ్‌ వర్క్‌ చేస్తున్నారట.

అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికర విషయం తెలుస్తోంది. ‘బిగిల్‌’ సినిమాలోని రాయప్పన్‌ తరహాలో ఫుల్‌ పవర్‌ఫుల్‌గా విజయ్‌ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ పాత్రను రాసుకున్నారట లోకేశ్‌. త్వరలో ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు సన్నిహితులు. ‘వారసుడు’ సినిమా తర్వాత విజయ్‌.. లోకేశ్‌ సినిమానే స్టార్ట్‌ చేస్తారని సమాచారం. ఆ సందర్భంగా ఏమన్నా లుక్స్‌ రిలీజ్‌ చేస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus