గిన్నీస్ రికార్డ్ హోల్డింగ్ డైరెక్టర్ విజయ నిర్మల కన్నుమూత!

  • June 27, 2019 / 07:44 AM IST

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ రెండో సతీమణి విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి (73) మృతి చెందారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విజ‌య‌నిర్మ‌ల‌.. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా సినీరంగంలో ప్ర‌వేశించారు. ఆమె తొలిచిత్రం మత్స్యరేఖ (త‌మిళం). తెలుగులో పాండురంగ మ‌హత్యం సినిమాలో న‌టించారు. అప్పుడు ఆమె వ‌య‌సు 11 ఏళ్లు.

విజ‌యనిర్మ‌ల అస‌లు పేరు నిర్మ‌ల‌.. అయితే అప్ప‌టికే నిర్మ‌ల పేరుతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ ఉండ‌డం, త‌న‌కు తొలి అవ‌కాశ‌మిచ్చిన విజ‌య సంస్థ మీద ఉన్న గౌర‌వంతో పేరును విజ‌యనిర్మ‌లగా మార్చుకున్నారు. న‌టిగా టాప్‌రేంజ్‌లో కొన‌సాగుతున్న స‌మ‌యంలో కృష్ణ‌మూర్తితో ఆమెకు వివాహం జ‌రిగింది. నరేష్ (సీనియ‌ర్‌) ఒక్కడే సంతానం. కృష్ణ‌మూర్తి నుంచి విడిపోయిన త‌ర్వాత సూపర్ స్టార్ కృష్ణను రెండవ వివాహం చేసుకున్నారు.1971 నుంచి విజ‌యనిర్మ‌ల సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ప్రారంభించారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక చిత్రాల‌కు (44) ద‌ర్శ‌కత్వం వ‌హించిన మ‌హిళ‌గా విజ‌య‌నిర్మల గిన్నీస్ రికార్డ్ (2002) లో ఎక్కారు. భ‌ర్త కృష్ణ ఈమె క‌లిసి 50 సినిమాల్లో జంట‌గా న‌టించారు. ప్ర‌ముఖ‌న‌టి జ‌య‌సుధ‌కు విజ‌య‌నిర్మల పిన్ని. ఈమె కార‌ణంగానే జ‌య‌సుధ‌కు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ త‌రువాత ఆమె కూడా టాప్‌ రేంజ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus