తన గ్లామర్ తోనూ నటనతోనూ ఇండస్ట్రీని ఓ ఊపేసారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. రాజకీయాల్లో ఆమె చాలా బిజీగా గడుపుతూ వస్తున్నారు. 2006 లో వచ్చిన ‘నాయుడమ్మ’ చిత్రం తర్వాత ఇప్పటి వరకూ మరో చిత్రంలో నటించలేదు విజయశాంతి. 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఒక్క చిత్రంలో నటించడానికి మాత్రమే ఆమె ఒప్పుకున్నారు. ఇక తాజాగా ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు విజయశాంతి.
రాజకీయాల్లో మీరు సాధించింది ఎంత అని విలేకరి అడిగిన ప్రశ్నకి విజయశాంతి సమాధానమిస్తూ.. ” మీరనుకున్నది సాధించకపోయినా నేననుకున్నది సాధించాను. “1998 జనవరి 26న ఉద్యమంలోకి వచ్చాను. ఏదైతే లక్ష్యం అనుకున్నానో అది సాధించాను. రాజకీయాల్లోకి వచ్చాం డబ్బు సంపాదించాం… ఇవన్నీ కాదు. ఇక్కడ ఎన్నో ఆశలు చూపారు. అయితే విజయశాంతి ఆలోచన అది కాదు. ఉద్యమం సాధించుకోవడం. తెలంగాణ నాకు ముఖ్యం. అది సాధించాను” అంటూ చెప్పారు. సినిమాల్లో విజయం .. శాంతి వచ్చాయి? రాజకీయాల్లో అవి దక్కలేదు కదా? అని అడుగగా… “అధికారంలోకి వస్తే శాంతిని ఇస్తాం…! రాజకీయాల్లో ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది… సెకండాఫ్ చూస్తారు. అక్కడ అనుకున్నది సాధించాను. ఉద్యమం గెలుచుకున్నా. మీరనుకున్నది పవర్. అది తర్వాత వస్తుంది” అంటూ ఛాలెంజ్ చేశారు విజయశాంతి.
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!