Vijayashanti: యూట్యూబ్‌ ఛానల్స్‌పై చర్యకు సిద్ధమంటున్న విజయశాంతి

విజయంశాంతిని అందరూ ఫైర్‌ బ్రాండ్‌ అని అంటుంటారు. ఎందుకంటే ఆమె మాట అంత కరుకుగా ఉంటుంది. తప్పు చేశారు అని తెలిస్తే వాళ్ల తాట తీసేంతవరకు వదలని నైజం ఆమెది. హీరోయిన్‌గా ఉన్న రోజులల్లో అందరూ లేడీ సూపర్‌స్టార్‌ అని అన్నారంటే దానికి ఆమె తెగువే కారణం. తాజాగా ఆమె అంతే తెగువతో యూట్యూబ్‌ ఛానల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాపై అబద్ధపు ప్రచారం చేస్తే… చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏమైందంటే…

ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను విజయశాంతి మెచ్చుకున్నారు. ఆ నటుల నటనను కూడా మెచ్చుకున్నారని కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ వీడియోలు విడుదల చేశాయి. అవి వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో విజయశాంతి తన ఫేస్‌బుక్‌ పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు. నాటి తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించని ఏ ఒక్క హీరో సినిమానుగానీ, వ్యక్తులను గానీ మెచ్చుకునే పరిస్థితే ఉండదు అంటూ ఘాటుగా స్పందించింది. ఇంకా ఆమె ఏమన్నారో… ఆమె మాటల్లోనే…

‘‘ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు యూట్యూబ్‌ ఛానెళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్లు బతికి, తెలంగాణలో ఆ సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందాం. నేను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తాను. ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్ధించని ఏ ఒక్క సినిమా హీరో చిత్రాలను గాని, వ్యక్తులను గాని నేడు కేసీఆర్ గారు ఒక అవగాహనతో సమర్ధిస్తున్న తీరులో నేను మాట్లాడటం ఎప్పటికీ జరగదు’’ – మీ విజయశాంతి

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus