ఇళయతలపతి విజయ్ నటించిన “తెరి” చిత్రానికి తెలుగు లో “పోలీసోడు” అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.
అయితే, కొన్ని పోలీస్ సంఘాలు దిల్ రాజు గారిని కలిసి, ఈ టైటిల్ పై అభ్యంతరం తెలపటం తో, అయన ఈ విషయాన్నీ నిర్మాత కలయిపులి ఎస్ థాను కు వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశం తో ఈ టైటిల్ ను పోలీస్ గా మరుస్తున్నట్టు ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్న దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 15 న తెలుగు రాష్ట్రాలలో “పోలీస్” పేరు తో గ్రాండ్ గా విడుదల అవుతుంది. .
ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ను ఇచ్చింది. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.
విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం – స్క్రీన్ప్లే – అట్లి .ఫోటోగ్రఫీ – జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం – జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు – రాజు , కలయిపులి ఎస్ థాను.