Vikram: దేవుడా.. స్టార్ హీరో విక్రమ్ ఆ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాత్రకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్న విక్రమ్ రెమ్యునరేషన్ డబుల్ అయిందని తెలుస్తోంది. విక్రమ్ ఇప్పటివరకు 23 కోట్ల రుపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు విక్రమ్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. సినిమా సినిమాకు విక్రమ్ క్రేజ్ మరింత పెరుగుతుండగా తంగలాన్ సినిమాతో విక్రమ్ మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

విక్రమ్ ఈ సినిమాతో శివపుత్రుడు, అపరిచితుడు రేంజ్ హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విక్రమ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో మాత్రమే నటించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. విక్రమ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. బలమైన కథ, కథనం ఉన్న సినిమాలను విక్రమ్ ఎంచుకుంటే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతున్నారు. విక్రమ్ భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

విక్రమ్ తన 62వ సినిమా కోసం ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా ఆఫర్లు పెరగడం వల్లే విక్రమ్ ఈ స్థాయిలో తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాలు హిట్ కావడం విక్రమ్ కెరీర్ కు కలిసొచ్చిందని మరి కొందరు చెబుతున్నారు. విక్రమ్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని ఆయన సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విక్రమ్ (Vikram) సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. విక్రమ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. విక్రమ్ తంగలాన్ సినిమాలో తనకు డైలాగ్స్ లేవని చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే టీజర్ లో మాత్రమే విక్రమ్ కు డైలాగ్స్ లేవని సినిమాలో డైలాగ్స్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus