సాయి పల్లవి కంటే తమన్నా బెటర్ : విక్రమ్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మలయాళం లో ప్రేమమ్ సినిమా ద్వారా దక్షిణాది సినిమా పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ఫిదా తో ఆమె పేరు మారుమోగింది. అందుకే ఆమె కావాలని తెలుగు, తమిళ నిర్మాతలు క్యూ కట్టారు. సాయి పల్లవి  తమ సినిమాలో ఉండాలని కోరుకున్న వారిలో స్కెచ్ సినిమా టీమ్ కూడా ఉంది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ముందుగా ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. తీరా సెట్స్ మీదకు వెళ్లేసరికి సాయి పల్లవిని తొలగించి తమన్నాని తీసుకున్నారు. సాయి పల్లవిని ఎందుకు తప్పించారో అప్పుడు చిత్ర బృందం స్పష్టమైన కారణం చెప్పలేదు. ప్రస్తుతం ఆ సినిమా కంప్లీట్ అయి రిలీజ్ కి సిద్ధమైంది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విక్రమ్ సాయి పల్లవి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.

సాయి పల్లవిని ఎందుకు పక్కకు పెట్టారు ? అని ప్రశ్నకు విక్రమ్ స్పందిస్తూ “సాయిపల్లవి కంటే తమన్నా బెటర్ ఛాయస్. చాలా బాగా నటించింది. బ్రాహ్మిణ్ అమ్మాయి పాత్రకు తమన్నా సరిగ్గా సరిపోయింది. సినిమా చూస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది” అని చెప్పారు. దీంతో సాయిపల్లవి షాక్ తింది. తమిళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న ఆమెకు విక్రమ్ మాటలు బాధ పెట్టినట్లు సమాచారం. సాయి పల్లవిని విక్రమ్ తక్కువ చేసి మాట్లాడడం ఏమి బాగాలేదని ఆమె అభిమానులు అంటుంటే.. మరికొంతమంది మాత్రం సాయి పల్లవి గురించి విక్రమ్ టీమ్ ముందుగానే పసిగట్టడం విశేషమని చెబుతున్నారు. ఏది ఏమైనా విక్రమ్ లాంటి నటుడు సాయి పల్లవి గురించి నెగటివ్ గా మాట్లాడడం ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus