Actress: ‘విక్రమార్కుడు’ నటికి చేదు అనుభవం..!

రాజమౌళి-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక సూపర్ హిట్ మూవీ ‘విక్రమార్కుడు’. ఈ సినిమాలో అత్తిలి సత్తి(రెండో రవితేజ) తో ‘ఒరేయ్ సత్తిగా.. బయటికి రారా సచ్చినోడా’ అంటూ చీపురు, చాటలతో గొడవకి దిగే వ్యక్తి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి జయవాణి. ఆ తరవాత రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’ ‘మర్యాద రామన్న’ సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో జయవాణికి పెద్దగా అవకాశాలు లేవు.

ఆమె గతంలో నటించిన సినిమాలే అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది అన్నది నిజం. ఫేస్బుక్ లో ఈమె పేజీకి వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్యనే ట్విట్టర్లో ఈమె పేరుతో ఓ అకౌంట్ కూడా ఓపెన్ అయ్యింది. ఇందులో అన్నీ అశ్లీల చిత్రాలే పోస్ట్ అవుతున్నాయి. ఆ అకౌంట్ కి 17 వేళకి పైగా ఫాలోవర్స్ ఉన్నాయి.

జయవాణి ఏంటి ఇలాంటి పోస్ట్ లు పెడుతుంది అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఆ అకౌంట్ కి ప్రమోషన్ దక్కేలా చేశారు. తాజాగా వెనుక నుండి బట్టలు లేకుండా ఉన్నట్లు ఓ ఫోటోని ఆ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు తాను ‘శూర్పణఖ’ అనే అడల్ట్ కంటెంట్ తో రూపొందుతున్న వెబ్‌సిరీస్లో నటిస్తున్నానని.. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోందని మ్యాటర్ కూడా రాసి ఉంది. ఐదు భాషల్లో ఈ సిరీస్ రాబోతోందని.. త్వరలోనే టీజర్ వస్తుందని కూడా అందులో ఉంది.

దీంతో జయవాణి (Actress) వెంటనే రియాక్ట్ అయ్యి ‘నా పేరు పై ఎవరో ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ‘మీరు ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా?’ అని చాలామంది అడుగుతున్నారు. నేను లేదని చెబుతున్నాను. బహుశా ఈ ట్వీట్లు చూసే వాళ్లు అడుగుతున్నారేమో. ఆ అశ్లీల ఫొటోలు నావి కావు. ఆ ట్విట్టర్ అకౌంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఆ ట్వీట్లను నమ్మొద్దు. ఇంకా ఇలాంటి నెగిటివ్ ట్వీట్లు వస్తే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus