తెలుగులో స్ట్రైట్ సినిమా చేయనున్న విక్రమ్ కుమారుడు!

  • July 17, 2018 / 11:09 AM IST

దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ తర్వాత అంతలా విలక్షణమైన పాత్రలు చేసిన నటుడు విక్రమ్. తన నటనతో తమిళనాడు ప్రజలతో పాటు తెలుగువారిని తన అభిమానులను మార్చుకున్నారు. ప్రస్తుతం అతని తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ ద్వారా ధృవ్ ని వెండితెరపై చూపించబోతున్నారు. అందుకోసం ధృవ్ దాదాపు ఆర్నెళ్లుగా ఎంత‌గానో క‌ష్ట‌ప‌డి మేకోవ‌ర్ సాధించాడు. “అర్జున్‌రెడ్డి” లుక్‌లో ధృవ్ అంద‌రినీ తెగ నచ్చేసాడు. ఈ మూవీ బాలా దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. మరోపక్క, తన కుమారుడిని  స్ట్రైట్ తెలుగు మూవీలో నటింపజేసేందుకు విక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధృవ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు విక్రమ్ ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇప్పటికే కథని కూడా ఫైనల్ చేసినట్లు తెలిసింది. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చాలాకాలం అపజయాలతో సతమతమయిన  శేఖర్ కమ్ముల ఫిదా మూవీతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఆ మూవీ తర్వాత స్టార్ హీరోలు పిలిచి సినిమా చేస్తామన్నా… కొత్తవారితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అందులో హీరోగా ధృవ్ నటిస్తాడా? లేక రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెడతారా ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus