Viswambhara: నెవర్ ఎక్స్పెక్టెడ్.. ‘విశ్వంభర’ విలన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) హీరోగా  ‘బింబిసార’ (Bimbisra) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకత్వలో ‘విశ్వంభర’ (Vishwabhara) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదొక సోసియో ఫాంటసీ మూవీ. మెగాస్టార్ కెరీర్లో 156 వ సినిమాగా ఇది రూపొందుతోంది. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యం.యం.కీరవాణి (M. M. Keeravani) సంగీత దర్శకుడు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత చిరుకి జోడీగా త్రిష (Trisha)  హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) వంటి యంగ్ హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.

అలాగే ఈ సినిమాలో రావు రమేష్ (Rao Ramesh) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో చిరంజీవి సినిమాల్లో ఈయన నటించింది అంటూ ఏమీ లేదు.ఇతని పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఇదిలా ఉండగా.. ‘విశ్వంభర’ లో విలన్ గా ఎవరు నటిస్తున్నారు? అనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతుంది. కొద్దిరోజుల క్రితం (Rana) రానా.. చిరుని ఢీ కొట్టే విలన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు ఎంపికయ్యాడు. అతను మరెవరో కాదు (Kunal Kapoor) కునాల్ కపూర్ అని సమాచారం. గతంలో ఇతను నాగార్జున(Nagarjuna) , నాని (Nani) కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ (Devadas) లో విలన్ గా నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇతనికి తెలుగులో అవకాశాలు రాలేదు. కొంచెం ఆలస్యమైనప్పటికీ.. ఇతనికి మెగా ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం లభించింది అని తెలుస్తుంది

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus